ఆ హీరోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క 

ఆ హీరోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క 

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ఈ ఏడాది ఆరంభంలో "భాగమతి" సినిమాతో ప్రేక్షకులను అలరించారు. దాని తరువాత ఏ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం విశేషం. చాలా కథలే విన్నప్పటికి దేనికి ఒకే చెప్పలేదు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం గోపీచంద్ సరసన అనుష్క నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. 

తమిళ దర్శకుడు జయేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈయన తాజాగా కళ్యాణ్ రామ్, తమన్నాలతో నా నువ్వే సినిమాను తెరకెక్కించాడు. మంచి పాజిటివ్ బజ్ తో మే 25న రిలీజ్ కానుంది. ప్రస్తుతం గోపీచంద్ తో చేయనున్న ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దీనికి నిర్మాతలుగా కిరణ్ ముప్పవరపు, విజయ్ కుమార్ వటికుట్టిలు వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా వివరాలు అధికారికంగా తెలియనున్నాయి. ఇక గోపీచంద్ విషయానికొస్తే..ప్రస్తుతం నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో పంతం అనే యాక్షన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.