ఆమెతో నాకు పెళ్లేంటి ..? ఆమె నా కూతురు లాంటిది.

ఆమెతో నాకు పెళ్లేంటి ..? ఆమె నా కూతురు లాంటిది.

గజల్‌ సింగర్‌, భజన్‌ మాస్ట్రో అనూప్‌ జలోటా, బిగ్‌బాస్‌ ఫేమ్‌ జస్లీన్‌ మథారు ప్రేమ వ్యవహారం మరో సారి వార్తల్లోకెక్కింది. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలోపెళ్లికూడా చేసుకోబోతున్నారని వార్తలు షికారు చేసాయి. ఈ ఇద్దరుకూడా అలానే చట్టపట్టాలేసుకు తిరిగారు. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ లో కూడా ఈ ఇద్దరు చాలా క్లోజ్ గా మెలిగారు.  ఇదిలా ఉంటే నుదుటిన సింధూరం, చేతులకు గాజులు ధరించి ఓ పాటకు అభినయిస్తూ జస్లీన్‌ ఇటీవల ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్‌ చేసింది. 

ఈ వీడియో చుసిన నెటిజన్లు అనూప్ , జస్లీన్ లు పెళ్లి చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై స్పందించిన అనూన్‌ జలోటా.. పెళ్లి వార్తలను కొట్టిపారేశారు. జస్లీన్‌ తనకు కూతురి వంటిదని.. ఆమె కోసం తాను వరుడిని అన్వేషిస్తున్నట్లు తెలిపారు.'జస్లీన్‌ కోసం ఆమె తండ్రితో కలిసి నేను వరుడి వేట మొదలుపెట్టాను.తను నా శిష్యురాలు. ఇంకా చెప్పాలంటే కూతురి వంటిది. అని అనూప్ పేర్కొన్నారు.