డ‌ల్లాస్‌ మహానాడు వద్ద గొడవ

డ‌ల్లాస్‌ మహానాడు వద్ద గొడవ

విదేశాల్లో కూడా తెలుగువారు పార్టీల వారీగా చీలిపోయారు. ఒక పార్టీ నేతలు వస్తే మరో పార్టీ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఇటీవల అమెరికా పర్యటనకు వచ్చిన చిరంజీవిని నిలదీస్తూ కొందరు బ్యానర్లు ప్రదర్శిస్తే... ఇపుడు  డ‌ల్లాస్ న‌గ‌రంలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు వేదిక వద్ద కూడా టీడీపీ వ్యతిరేక వర్గాలు ప్ల కార్డులతో నిరసన తెలిపారు. మహానాడు నిర్వహిస్తున్న హోటల్‌ బయట కొందరు తెలుగు ఎన్నారైలు  నల్ల  దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేసారు. ప్రత్యేక హోదా తేవడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వీరు ఆరోపించారు.