కర్ణాటకలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ

కర్ణాటకలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ

కర్ణాటక రాజధాని బెంగళూరు పరిధిలోని జయనగర అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ హోం మంత్రి రామలింగారెడ్డి తనయ సౌమ్యారెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్పై 2889 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో జేడీఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికింది. ఈ నెల 11న ఇక్కడ పోలింగ్ జరగగా ఇవాళ కౌంటింగ్‌ నిర్వహించారు.  సార్వత్రిక ఎన్నికలతో పాటే జయనగర అసెంబ్లీ ఎన్నిక కూడా జరగాల్సి ఉన్నా పోటీలో ఉన్న అభ్యర్థి హఠాత్తుగా మరణించడంతో ఎన్నిక వాయిదా పడింది.