మొన్న దాచేపల్లి.. నేడు చుండూరు

మొన్న దాచేపల్లి.. నేడు చుండూరు

దాచేపల్లిలో మైనర్ బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేయడం.. అది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడం.. అదే సమయంలో నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచనలం సృష్టించింది. ఈ ఘటనను ఇంకా మరచిపోకముందే.. అదే గుంటూరు జిల్లాలో మరో చిన్నారిపై అత్యాచారం జరిగింది. చుండూరు మండలం మోదుకూరు గ్రామంలో ఏడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతన్ని అదే గ్రామానికి చెందిన నాగుల్‌మీరాగా గుర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.