ఎఫ్ 3 కి ముందే బాలకృష్ణ మూవీ ..?

ఎఫ్ 3 కి ముందే బాలకృష్ణ మూవీ ..?

ప్రస్తుతం టాలీవుడ్ లో విజయాలతో దూసుకపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన తీసిన 5 సినిమాలు అద్భుతమైన విజయాల్ని సాధించాయి. చివరిగా ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ కా బాప్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తరువాత అనిల్ గత ఏడాది సంక్రాంతి కి వచ్చిన ఎఫ్-2 కి సీక్వెల్ గా ఎఫ్-3 సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష తో అనీల్ ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే  బాలకృష్ణను అనీల్ కలిశాడట. వీరిద్దరి కాంబోలో సినిమా గత మూడు సంవత్సరాలుగా అనుకుంటున్నారు. అది కాస్త వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎఫ్ 3 సినిమా స్క్రిప్ట్ దాదాపుగా పూర్తి అయినా పట్టాలెక్కే సరికి కాస్తా సమయం పట్టేలా ఉందట. ఈలోగా బాలకృష్ణ సినిమా పూర్తి చెయ్యాలని చూస్తున్నాడట అనీల్. బాలయ్య ప్రస్తుతం బోయపాటితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలోనే కరోనా కారణంగా ఆగిపోయింది. లాక్ డౌన్ ఎత్తి వేసి షూటింగ్స్ కు అనుమతిస్తే రెండు నెలల్లో బోయపాటి మూవీని బాలయ్య పూర్తి చేయబోతున్నాడట. ఆతరవాత అనీల్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు రామారావు అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నారట  రామారావు సినిమాను వచ్చే ఏడాది చివరిలో విడుదల చేసి ఎఫ్ 3 ని 2022 సంక్రాంతి కి తీసుకురావాలని అనీల్ చూస్తున్నాడని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.