నివేదిక రాకముందే క్లీన్ చిట్ ఇచ్చుకుంటారా ? 

నివేదిక రాకముందే క్లీన్ చిట్ ఇచ్చుకుంటారా ? 


పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పర్యటించిన ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ విపక్షం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై నివేదికను ఇంకా కేంద్రానికి పంపలేదని అన్నారు అనిల్. ఆ విషయాన్నే కేంద్రం చెబితే అవినీతి జరగలేదని ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ నేతలపై అనిల్ మండిపడ్డారు. విజిలెన్స్ నివేదిక రాకముందే అవినీతి జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. పట్టిసీమలో మూడు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కాగ్ చెప్పిందన్న అనిల్ పోలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా 800 కోట్ల రూపాయలు ఆదా చేశామని అన్నారు. పోలవరంలో 20శాతం పనులు పూర్తి చేసి, 70 శాతం చేశామని టీడీపీ అబద్దాలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. పోలవరం పూర్తి చేసేది తామేనన్న అనిల్, పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు.