కరోనా ఎఫెక్ట్.. ఏపీలో కొత్త చట్టం

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో కొత్త చట్టం

కరోనా నివారణకు ఇటు తెలంగాణ సర్కార్ తో పటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కోవిడ్ 19 రెగ్యులేషన్స్ 2020 పేరుతో కొత్త చట్టం అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ కొత్త చట్టం ప్రకారం.. కరోనా అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని వైద్యం చేయించే అధికారం ప్రభుత్వ అధికారులకు ఇచ్చింది. కరోనా రిపోర్టు అయిన గ్రామం, పట్టణం, వార్డు, కాలనీ పరిధిలోని అధికారికి దీనికి సంబంధిచిన అధికారాలు కట్టబెట్టింది సర్కార్. కరోనా లోకల్ ట్రాన్స్ మిషన్ జరిగితే దాని నుంచి బయటపడేందుకు ప్రైవేటు ఆస్పత్రులను సైతం ఐసోలేషన్ వార్డులుగా మార్చే అధికారం కల్పించారు. రిటైర్డ్‌ వైద్యులు, నర్సులు, ప్రైవేటు వైద్యులు అవసరాన్నిబట్టి విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొనగా.. ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమలులో ఉండనున్నాయి.