భయం గుప్పిట్లో ఏపీ...అలాంటి కంపెనీలు 86... పాలిమర్స్ లాంటి దుర్ఘటన జరిగితే...!!

భయం గుప్పిట్లో ఏపీ...అలాంటి కంపెనీలు 86... పాలిమర్స్ లాంటి దుర్ఘటన జరిగితే...!!

వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ ఘటన ఒక్క ఏపీ రాష్ట్రాన్ని మాత్రమే కాదు.  యావత్ భారత దేశాన్ని కుదిపేసింది.  లాక్ డౌన్ నిబంధనల తరువాత కంపెనీని తిరిగి ప్రారంభించే సమయంలో స్టెరిన్ గ్యాస్ లీకవడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఐదు గ్రామాలపై దీని ప్రభావం కనిపించింది.  దీంతో అప్రమత్తమైన ఏపీ సర్కార్ దీనిపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది.  రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్, పోలీసులు ఎల్జీ పాలిమర్స్ భద్రతా ప్రమాణాలపై దృష్టిపెట్టి దర్యాప్తు చేస్తున్నారు.  

ఇక ఇదిలా ఉంటె, లాక్ డౌన్ తరువాత రాష్ట్రంలో పరిశ్రమలు తెరుచుకోబోతున్న సమయంలో ఎల్జీ పాలిమర్స్ లాంటి కంపెనీలు 86 ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది.  వీటి భద్రత ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.  ఇవన్నీ ఖచ్చితమైన భద్రతా పరమైన నియమాలు పాటిస్తున్నారా లేదా అన్నది చెక్ చేసేందుకు ప్రభుత్వం ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసింది.  భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి అనే విషయంపై అధికారికంగా పరిశ్రమ నుంచి లేఖలు ఇవ్వాలని ప్రభుత్వం కోరినట్టు తెలుస్తోంది.  రసాయనిక పరిశ్రమల్లో ఏదైనా తేడా జరిగి, ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదం లాంటిదే ఆయా కంపెనీల్లో జరిగితే పరిస్థితి ఏంటి అన్నది అందరి ముందున్న ప్రశ్న.  అందుకే ప్రభుత్వం ఆ 86 కంపెనీలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.