ఏపీలో మద్య నిషేదానికి మరో ప్లాన్.!

   ఏపీలో మద్య నిషేదానికి మరో ప్లాన్.!

ఏపీలో మద్య నిషేధం దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్య నిషేధం కై  ధరలను భారీగా పెంచిన సర్కార్ ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం, డ్రగ్స్ కు అలవాటు పడినవారిని రక్షించడానికి ఆ అలవాటు నుండి దూరం చేయడానికి  మద్యం, మాదక ద్రవ్యాల విమోచనా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో డిజిటల్ విధానంలో శుక్రవారం ఈ కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదట 15 ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వీటి నిర్వహణ కోసం సంవత్సరానికి 4.98 కోట్లు వ్యయం చేయనున్నామని ప్రభుత్వ కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. కాగా మాదకద్రవ్యాల వినియోగం తగ్గింపులో భాగంగా వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ సహకారంతో విభిన్న ప్రతిభావంతులు, లింగమార్పిడి, వయోవృద్దుల విభాగం రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.