గత 24 గంటల్లో ఏపీలో కరోనా కేసులు ఎన్నంటే ?

గత 24 గంటల్లో ఏపీలో కరోనా కేసులు ఎన్నంటే ?

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.  రోజు రోజుకు కరోనా తీవ్రరూపం దాల్చుతున్నది.  అందుకే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై ఇప్పటికే ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. అయినా సరే వారి వలన కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 704 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14595కి చేరింది.  గత 24 గంటల్లో ఏడుగురు కరోనాతో మరణించారు.  దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 187కి చేరింది.  

నమోదైన మొత్తం కేసుల్లో 7897 కేసులు యాక్టివ్ గా ఉండగా, 6511 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 704 కేసుల్లో 648 కేసులు ఏపీకి చెందినవికాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 51 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన ఐదు మందికి కరోనా సోకింది.  ఇక జిల్లాల వారీగా చూసుకుంటే, గడిచిన 24 గంటల్లో అనంతపూర్ లో 104, చిత్తూర్ లో 107, తూర్పు గోదావరిలో 55, గుంటూరులో 58, కడపలో 75, కృష్ణా జిల్లాలో 84, కర్నూల్ జిల్లాలో 82, నెల్లూరు జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 31, విశాఖపట్నంలో 26,  విజయనగరంలో 13, పశ్చిమగోదావరి జిల్లాలో 7 కొత్త కేసులు నమోదయ్యాయి.