నేడు కర్నూలు జిల్లాకు చంద్రబాబు

నేడు కర్నూలు జిల్లాకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 నిమిషాలకు పూడిచర్ల వద్ద జైరాజ్‌ ఇస్పాత్‌ లిమిటెడ్‌కు ఆయన భూమిపూజ నిర్వహింస్తారు. ఆ తర్వాత ఉదయం 11.50 గంటలకు ఓర్వకల్లులో ఉర్దూ, రూసా క్లస్టర్‌ వర్సిటీలకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు.

ఆ తర్వాత  మధ్యాహ్నం 2.10 గంటలకు ఏపీఎస్పీ బెటాలియన్‌ గ్రౌండ్‌కు చంద్రబాబు చేరుకోనున్నారు. అక్కడ మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రత్యేక హోదాపై చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలు, మీడియాతో సీఎం ముఖాముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు.