కరోనా పాజిటివ్ అంటూ వస్తున్న వార్తలపై ఫైర్ అయిన యాంకర్

కరోనా పాజిటివ్ అంటూ వస్తున్న వార్తలపై ఫైర్ అయిన యాంకర్

ప్రభుత్వం లాక్ డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో ఇటు సినీ పరిశ్రమతో పాటు, అటు టీవీ సీరియల్స్ షూటింగ్స్‌ను మొదలుపెట్టాయి. అయితే అంతా మంచి జరుగుతుందని భావించిన పరిశ్రమకు ఒకదాని తర్వాత ఒకటి అడ్డంకులు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా బుల్లి తెరనటులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే నలుగురు సీరియల్ యాక్టర్స్ కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రభాకర్, హరికృష్ణ, నవ్య స్వామికి గతంలో కరోనా సోకగా..యాకర్ ఝాన్సీకి కూడా కరోనా సోకిందంటూ వార్తలు షికారు చేశాయి. ఆమె నిర్వహించిన ఓ ప్రోగ్రాం షూటింగ్ సందర్బంగా పాజిటివ్ ఉన్న వారితో ఆమె కాంటాక్ట్ అవ్వడం వల్ల ఆమెకు కూడా పాజిటివ్ వచ్చిందనేది వార్తల సారాంశం. తనకు వైరస్ పాజిటివ్ అంటూ మీడియాలో వస్తున్న వార్తలపై ఝాన్సీ మండిపడినది. ఆమె సోషల్ మీడియా లైవ్ ద్వారా పుకార్లకు చెక్ పెట్టింది. నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. గాసిప్స్ గురించి మాట్లాడేందుకు మాత్రం నాకు ఎవరు కాల్ చేయవద్దంటూ విజ్ఞప్తి చేసింది.