పార్టీ మారే ఆలోచనలో ఆనం.. నేడు తుది నిర్ణయం

పార్టీ మారే ఆలోచనలో ఆనం.. నేడు తుది నిర్ణయం

గత కొన్ని రోజులుగా ఏపీలో అధికార టీడీపీని వీడనున్నట్లు టీడీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డిపై పలు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. గతంలో టీడీపీ నుండి ఎన్నో పదవులు చేపట్టి సమర్థంగా పనిచేశానని.. గౌరవం, గుర్తింపు లేని చోట తాను ఉండలేనని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తమ కుటుంబానికి ఉన్న సన్నిహితులు, అనుచరులు, అభిమానులతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. మరోవైపు సూళ్లూరుపేటలో కూడా ఉన్న సన్నిహితులతో భేటీ అయిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై సరైన నిర్ణయం తీసుకుంటానన్నారు. ఈ రోజు ఆనం సూళ్లూరుపేటలో పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలను కలవనున్నారు. దీంతో ఆనం టీడీపీని వీడుతున్నారన్న వార్తలకు బలం చేకూరింది.