ఈ రాత్రికి సన్నీ లియోన్ సంచనలన ప్రకటన 

ఈ రాత్రికి సన్నీ లియోన్ సంచనలన ప్రకటన 

సన్నీ లియోన్..ఈ పేరుకి మన దేశంలో ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ ద్వారా సినీ పరిశ్రమకు వచ్చి అంచె లంచెలుగా ఎదుగుతోంది. సన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా నిర్మాతలు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో వీరమహాదేవి సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని తమిళ దర్శకుడు వడివుడయాన్ తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం కోసం సన్నీ యుద్ధ విద్యలను, గుర్రపు స్వారీ సైతం నేర్చుకోవడం విశేషం. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెడుతోంది. అందులో భాగంగానే ఈ రోజు రాత్రి..సినిమా నుండి ఓ సర్ప్రైజ్ రానుంది. భారీ బడ్జెట్ తో రూపొందనుతున్న ఈ చిత్రాన్ని స్టీవ్ కార్నర్ నిర్మిస్తున్నారు.