జగన్ కు అమిత్ షా ఫోన్..అందుకే !

జగన్ కు అమిత్ షా ఫోన్..అందుకే !


దేశంలో కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ ఎత్తివేత, దేశ ఆర్థికగమనం, చైనాతో సరిహద్దు ఘర్షణలు లాంటి సమస్యలపై కేంద్రం నేడు అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. అయితే దీని ముఖ్య అజెండా మాత్రం చైనా సరిహద్దు ఘర్షణ అని చెబుతున్నారు. మోడీ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ అన్ని పార్టీలను కేంద్రం ఆహ్వానిస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడి పరిస్థితులను విపక్ష, మిత్ర పక్షనేతలకు వివరించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. అఖిలపక్షం ఉద్దేశాలను సీఎం జగన్ కు వెల్లడించారు. ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా జగన్ ను అమిత్ షా కోరినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకాంశాలు కూడా చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. ఇక మరో పక్క ఇదే విషయం మీద సీఎం కేసీఆర్ తోనూ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.