`ఆఫీస‌ర్‌`కి బిగ్‌బి అండాదండా

`ఆఫీస‌ర్‌`కి బిగ్‌బి అండాదండా

కింగ్ నాగార్జున‌- బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ స్నేహం ఇప్ప‌టిది కాదు. 1992లో రిలీజైన `ఖుదాగ‌వా`లో ఆ ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. నాటి నుంచి ఆ స్నేహానుబంధం కొన‌సాగుతూనే ఉంది. అమితాబ్‌కి అక్కినేని అంత‌ర్జాతీయ అవార్డు ద‌క్కింది. ఇటీవ‌లే `మ‌నం` చిత్రంలోనూ ఏఎన్నార్‌- నాగార్జున కోసం అమితాబ్ ఓ అతిధిపాత్ర పోషించారు.

అంత పెద్ద అనుబంధం ఉంది కాబ‌ట్టే, ఇప్పుడు నాగ్‌-ఆర్జీవీ `ఆఫీస‌ర్` ట్రైల‌ర్‌ని బాలీవుడ్‌లో ప్ర‌మోట్ చేస్తున్నారు అమితాబ్‌. ఈ ట్రైల‌ర్‌ని బిగ్‌బి స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి కావాల్సిన ప్ర‌మోష‌న్ చేసి పెడుతున్నారు. అమితాబ్‌కి ట్విట్ట‌ర్‌లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈ ట్రైల‌ర్ అటు ఉత్త‌రాదినా వేగంగా పాపుల‌ర‌వుతుంద‌న‌డంలో సందేహం లేదు. అది హిందీ బిజినెస్‌కి అక్క‌ర‌కొస్తుంది. స్నేహం కోసం.. స్నేహితుడి కోసం... లెజెండ్ అమితాబ్ చేస్తున్న సాయం అంద‌రికీ స్ఫూర్తినిచ్చేదే.