రష్యా, చైనా వాక్సిన్ లపై అమెరికా సంచలన వ్యాఖ్యలు... 

రష్యా, చైనా వాక్సిన్ లపై అమెరికా సంచలన వ్యాఖ్యలు... 

ఈనెల 10వ తేదీలోగా తమ దేశం నుంచి వాక్సిన్ రాబోతున్నట్టు ఇప్పటికే రష్యా ప్రకటించింది.  అటు చైనా సైతం వాక్సిన్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్తున్నది.  అయితే, అమెరికాలోని మోడెర్నా ఫార్మా నుంచి వచ్చే వాక్సిన్ ఈ ఏడాది చివరి వరకు రావొచ్చని అంటున్నారు.  అటు ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చే వాక్సిన్ కూడా ఈ ఏడాది చివరినాటికి వచ్చే అవకాశం ఉన్నది.   అందరికంటే ముందుగా రష్యా వాక్సిన్ ను రిలీజ్ చేయబోతున్న తరుణంలో అమెరికా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.  

రష్యా, చైనాలో వాక్సిన్ విషయంలో పారదర్శకత ఉండదని, ఆ దేశాల నుంచి వచ్చే వాక్సిన్ లను తమ దేశం వినియోగించబోదని సిడిసి డైరెక్టర్ డాక్టర్ ఫౌసి పేర్కొన్నారు.  ఇతర దేశాలతో పోలిస్తే రష్యా, చైనా దేశాల ఔషధ నియంత్రణ సంస్థలు పారదర్శకతకు దూరంగా ఉంటాయని, ఆ దేశాలు తయారు చేసే కోవిడ్ 19 వాక్సిన్ పై తమకు భరోసా లేదని ఫౌసీ పేర్కొన్నారు. అయితే, ఔషధ నియంత్రణ నిబంధనలకు అనుగుణంగానే వాక్సిన్ తయారవుతున్నట్టు రష్యా  తెలియజేసింది. వాక్సిన్ రిలీజ్ కోసం రష్యా చెప్పిన సమయం దగ్గర పడుతుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది.