డేంజర్  బెల్స్:  అమెరికాలో వెయ్యి దాటిన మరణాలు... 

డేంజర్  బెల్స్:  అమెరికాలో వెయ్యి దాటిన మరణాలు... 

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అమెరికాలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  ఇప్పటి వరకు అమెరికాలో 68,203 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  1027 మంది మరణించారు.  దీంతో ట్రంప్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.  అమెరికాలోని చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ చేశాయి.  కరోనా కేసులు అత్యధికంగా ఉన్న లాస్ ఏంజెల్స్, క్యాలిఫోర్నియా ప్రాంతాలు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అయ్యాయి.  

పోలీసులు ఎన్ని చెప్తున్నా వినకపోవడంతో  అక్కడి ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. అత్యవసరం ఉన్న వాహనాలను మాత్రమే బయటకు పంపుతున్నారు.  ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది.  ప్రతి రోజు 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ట్రంప్ ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకొని నిలబడతామని, దేశం మొత్తం లాక్ డౌన్ చేసే ప్రసక్తి లేదని అంటున్నాడు.  ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అన్నది తెలియాల్సి ఉన్నది.  ఇప్పటికే దాదాపుగా అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.