అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్

అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్

అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. చైనాకు అగ్రరాజ్యం అమెరికా మరోసారి షాక్ ఇచ్చింది. 50 బిలియన్ డాలర్లు విలువైన చైనా వస్తువులపై వైట్ హౌస్ 25శాతం పన్ను విధించింది. స్వదేశీ వస్తువుల వినియోగం, ఉత్పత్తిని పెంచేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికా నిర్ణయంతో చైనా స్పందించింది. తామూ  అమెరికా వస్తువులపై టారీఫ్ పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపింది. గతంలోనే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై చైనా 3 బిలియన్ డాలర్ల పన్నులు విధించింది. మరోవైపు... చైనా నుంచి దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియంలపై 60బిలియన్ డాలర్ల వార్షిక పన్ను విధిస్తూ గతంలో అమెరికా ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ట్రేడ్ వార్ మరింత ముదిరింది అనే అభిప్రాయం వెల్లడవుతోంది.