సింగిల్‌గా పోటీ చేస్తే.. టీడీపీ ఓటమి ఖాయం

సింగిల్‌గా పోటీ చేస్తే.. టీడీపీ ఓటమి ఖాయం

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు కొత్త పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని.. కానీ ఆయనతో జతకట్టడానికి ఏ రాజకీయపార్టీ కూడా ముందుకు రాదని అన్నారు. గతంలో సింగిల్‌గా ఎన్నికల బరిలో నిలిచిన సందర్భంలో తెలుగుదేశం చిత్తుగా ఓడిపోయిందని రాంబాబు గుర్తు చేశారు.. కర్నాటకలో కొత్త రాజకీయ పొత్తుల కోసం చంద్రబాబు ప్రయత్నించారన్నారు.. నవనిర్మాణ దీక్ష, మహా సంకల్ప దీక్షలతో ప్రజల సహనాన్ని చంద్రబాబు మరోసారి పరీక్షించనున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పుష్కరాలలో దేవతా విగ్రహాలను మునిసిపల్ ట్రాక్టర్‌తో తొలగించారని.. అహంకారం, అధికారమదంతో దైవానికి సైతం కులం అంటగట్టడం సరికాదన్నారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సింగిల్‌గా వెళుతుందని.. టీడీపీలా గుంపులతో కలవదని రాంబాబు వ్యాఖ్యానించారు.