ఆన్‌లైన్‌లోనూ ఆ వస్త్రాలు..
చేనేత దుస్తులకు ఆదరణ ఎప్పటికీ తగ్గదు. ఆ సంప్రదాయ వస్త్రాలను కోరుకోని వారూ ఉండరు. ఇకపై ఆన్‌లైన్‌లోనూ చేతేన వస్త్రాలు విక్రయించేందుకు అమెజాన్ ఏర్పట్లు చేసింది. ఈమేరకు కేంద్ర జౌళిశాఖ హ్యాండ్లూమ్స్విభాగం ప్రారంభించిన 'వీవ్స్ మార్ట్'తో ఒప్పందం కుదుర్చకుంది. దీంతో.. ఇకపై 'వీవ్స్ మార్ట్'లో లభించే దుస్తులన్నీ అమెజాన్‌లో కూడా లభ్యమవుతాయి. విక్రయాల ప్రారంభ ఆఫర్‌గా 30 నుంచి 50 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేతేన ఉత్పత్తులను ప్రస్తుతం 'వీవ్స్ మార్ట్' విక్రయిస్తోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)