ఆత్మనిర్భర్ భారత్ కు అమెజాన్ మద్దతు... చైనాకు చెక్ పెట్టేందుకు... 

ఆత్మనిర్భర్ భారత్ కు అమెజాన్ మద్దతు... చైనాకు చెక్ పెట్టేందుకు... 

కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రధాని మోడీ ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో   భారీ ప్యాకేజీని ప్రకటించారు.  దేశీయంగా ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ ప్యాకేజీలో అనేక ప్రోత్సాహకాలు ఇచ్చారు.  గాల్వాన్ ఘటన తరువాత చైనాకు చెందిన 59 రకాల యాప్స్ పై నిషేధం విధించింది.  అలానే చైనా ఉత్పత్తులను కూడా నిషేదించాలని ఇప్పటికే వర్తక వాణిజ్య సంఘాలు పిలుపునిచ్చాయి.  ఈ నేపథ్యంలో దేశీయంగా మన అవసరాలకు తగిన విధంగా  ఉత్పత్తులను ఉత్పత్తి చేసేందుకు అనేక దేశీయంగా అనేక కంపెనీలు ముందుకు వచ్చి ఉత్పత్తి చేస్తున్నాయి.  

 చైనా వస్తువులకు చెక్ పెట్టేందుకు ఇండియా మరో అడుగు ముందుకు వేసింది.   దేశంలో అమ్మే అన్ని ఉత్పత్తులపై అవి ఎక్కడ తయారు చేశారో  ఖచ్చితంగా  పేర్కొనాలంటూ ఈ కామర్స్ సంస్థలకు వాణిజ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.   దీనిపై స్పందించిన అమెజాన్, భారత వాణిజ్య మంత్రిత్వశాఖ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పింది.  తమ సైట్ ద్వారా అమ్మకం జరిపే ప్రతి ఉత్పత్తిపై ఆ దేశం పేరు తప్పకుండా ఉండేలా చూడాలని అమ్మకందారులకు  అమెజాన్ ఆదేశాలు జారీ చేసింది.  ఆగష్టు 10 వ తేదీలోగా వస్తువులకు సంబంధించిన జాబితాను ఇవ్వాలని కోరింది.  అమెజాన్ కంపెనీ చైనాలో తయారయ్యే అనేక వస్తువులను ఇండియాలో తమ సైట్ ద్వారా విక్రయిస్తుంది.   మరి ఈ వస్తువులపై ఇండియా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  ముఖ్యంగా చైనాలో తయారయ్యే అనేక మొబైల్స్ ఇండియాలో విక్రయిస్తుంటారు.