విడాకుల ముందు రికార్డు.. ఇప్పుడు బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

విడాకుల ముందు రికార్డు.. ఇప్పుడు బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ వ‌ణికిస్తోన్న స‌మ‌యంలో.. ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు దెబ్బ‌తిని.. ఆర్థిక వ్య‌వ‌స్థ త‌ల‌కిందులు అవుతోంది.. అయినా ఆయ‌న సంపాద‌న ఆగ‌లేదు.. మ‌రోవైపు... భార్య‌కు విడాకులు ఇవ్వ‌డంతో.. ఆమెకు త‌న ఆస్తిలో వాటా ఇచ్చినా.. ఆయ‌న సంపాద‌న ఏమాత్రం త‌ర‌గ‌లేదు.. అంతేకాదు మ‌రింత పెరిగి.. ప్ర‌పంచ కుభేరుడిగా ఉన్న ఆయ‌న‌.. త‌న రికార్డును తానే బ‌ద్ద‌లు కొట్టుకుని ఎవ్వ‌రికీ అంద‌నంత ఎత్తుకు చేరుకున్నారు.. ఆయ‌నే అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్.. తాజాగా, ‌అమెజాన్ షేర్లు 4.4 శాతం పెరిగి రికార్డు స్థాయి 2,879 డాలర్లకు చేరాయి.  దీంతో ప్రపంచ కుబేరుడైన జెఫ్ బెజోస్ ఆదాయం 171.6 బిలియన్ డాలర్లకు ఎగిసింది.. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, సెప్టెంబర్ 4, 2018 నాటికి బెజోస్ సంపద 167.7 బిలియన్ డాలర్ల ద‌గ్గ‌ర రికార్డు స్థాయిని తాక‌గా.. ఇప్పుడు తన రికార్డును తనే బ్రేక్ చేసుకున్నాడు అమెజాన్ సీఈవో.. 

ఓవైపు కరోనా మహమ్మారి క‌మ్ముకొస్తున్నా.. ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెల‌కొన్నా.. ఈ ఏడాదిలోనే అమెజాన్ సీఈవో 56.7 బిలియన్లను ఆర్జించడం స‌రికొత్త రికార్డుగా చెప్పుకోవాలి. మరోవైపు త‌న భార్య  మెకెంజీతో గ‌త సంవ‌త్సంర విడుకుల కార‌ణంగా.. అమెజాన్ లో తన వాటాలో నాలుగింట ఒక వంతును వదులుకోవాల్సి వ‌చ్చింది.. అయినా.. ఆయ‌న ప్ర‌పంచ కుభేరుడే.. ఇక‌, ఇదే స‌మ‌యంలో.. జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ సంపద నికర విలువ 56.9 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో.. బ్లూమ్‌బెర్గ్ ర్యాంకింగ్‌లో ఆమె 12వ స్థానాన్ని పొందారు.. అంతేకాకుండా.. ప్రపంచంలో రెండవ సంపన్న మహిళగా అవ‌త‌రించారు.. క‌రోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉన్న స‌మ‌యంలో.. ప్రపంచ కుబేరుల్లో కొంద‌రి సంప‌ద స్ప‌ల్పంగా పెరిగింది.. మరికొంత మంది భారీగా న‌ష్టాలు చ‌విచూశారు. జెఫ్ బెజోస్ మాత్రం త‌న రికార్డును తానే తిర‌గ‌రాసుకున్నారు.