పిల్లల క్యూట్ ఫోటోను షేర్ చేసిన బన్నీ సతీమణి

పిల్లల క్యూట్ ఫోటోను షేర్ చేసిన బన్నీ సతీమణి

టాలీవుడ్‌లో కొందరు హీరోల పిల్లలు ప్రేక్షకులతో, అభిమానులతో బాగా చేరువగా ఉంటారు. ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటే.. ఆ తర్వాత అల్లు అర్జున్ ఉంటాడు. తన ఇద్దరు పిల్లలను అభిమానులకు తెలిసేలా పెంచుతున్నాడు బన్నీ. వాళ్లకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటాడు బన్నీ . తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన పిల్లల క్యూట్ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలో అయాన్, అర్హలు రెయిన్ కోట్ ధరించి వర్షంలో నిలుచొని ఫోటోకి ఫోజ్ ఇచ్చారు . ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇక బన్నీ ప్రస్తుతం సుకుమార్ తో  కలిసి 'పుష్ప' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .  కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ . ఈ మహమ్మారి తగ్గుమొఖం పట్టగానే మొదలయ్యే అవకాశం ఉంది .