రెండు కథల్ని వద్దనేశాడు 

రెండు కథల్ని వద్దనేశాడు 

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వైవిధ్యమైన కథాంశంతో వచ్చినా మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. ఇక దీని వల్ల ప్రయోగాల జోలికి వెళ్లకూడదని బన్నీ ఫిక్స్ అయ్యాడట. అల్లు అర్జున్ తదుపరి సినిమా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలోనే ఉంటుందని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయన మంచి ప్రయోగాల స్పెషలిస్ట్ గా పేరుంది. 

అల్లు అర్జున్ కూడా విక్రమ్ కుమార్ తో సినిమా చేయడానికి ఆసక్తిగానే ఉన్నాడు. ఈ తరుణంలో రెండు కథలను బన్నీ ముందు పెట్టగా కాస్త ప్రయోగానికి దగ్గర ఉన్నట్లు అనిపించడంతో వద్దనేశాడట. సో ఇక తాజాగా ఓ కొత్త వినిపించగా బన్నీ బాగుందని చెప్పాడట. దానికి కాస్త కమర్షియల్ ఎలెమెంట్స్ కలిపి ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పాడట. ఈ చిత్రనికి నల్లమలుపు బుజ్జి, వెంకటేశ్వర్ రావులు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.