అల వైకుంఠపురంలో హిందీ రీమేక్... హీరో ఎవరంటే..?

అల వైకుంఠపురంలో హిందీ రీమేక్... హీరో ఎవరంటే..?

అల్లు అర్జున్ "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమా పరాజయం తరువాత చాల గ్యాప్ తీసుకొని చేసిన సినిమా అల వైకుంఠపురంలో. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమాలో బన్నీ కి జంటగా పూజ హేగ్దే నటించింది. అయితే ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమాను హిందీ లో రీమేక్ చేయనున్నారట. ఈ సినిమా రీమేక్ రైట్స్ కూడా భారీ ధర పలికాయి అని తెలుస్తుంది. ప్రొడ్యూసర్ అశ్విన్ వార్డె భారీ మొత్తని చెల్లించి ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారట. అశ్విన్ గత ఏడాది షాహిద్ కపూర్ తో అర్జున్ రెడ్డి సినిమా హిందీ రీమేక్ కబీర్ సింగ్ గా తెరకెక్కించడు. ఆ సినిమా అక్కడ 300 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను కూడా  షాహిద్ కపూర్ తోనే తీయాలని చూస్తున్నాడట. కానీ షాహిద్ ప్రస్తుతం మరో తెలుగు సినిమా జెర్సీ రీమేక్ చేస్తున్నాడు. ఇక అల వైకుంఠపురంలో ఇక్కడ అంత పెద్ద విజయం సాధించడానికి ముఖ్య కారణంగా థమన్ అందించిన మ్యూజిక్ మరి అక్కడ కూడా ఈ తరహా మ్యూజిక్ ఎవరిస్తారో చూడాలి మరి.