సౌదీ రాజుకు అల్-ఖైదా వార్నింగ్...

సౌదీ రాజుకు అల్-ఖైదా వార్నింగ్...

సౌదీ అరేబియాలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌కు వార్నింగ్ ఇచ్చింది అల్-ఖైదా. తాజాగా సౌదీ అరేబియాలో విధాన పరమైన మార్పులపై ప్రసంగించిన ప్రిన్స్ మహ్మద్... సినిమాల పునర్ ప్రదర్శనకు అనుమతులు, వాహనాలు నడిపేందుకు మహిళలకు అనుమతించడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీనిపై ఓ బులెటిన్ విడుదల చేసిన అల్ ఖైదా... ఇదో పాపాత్మకమైన ప్రాజెక్టుగా పేర్కొంది. సల్మాన్... సినిమా థియేటర్లతో మసీదులను రీప్లేస్ చేస్తున్నారని ఆరోపించింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుండి నాస్తికులు, లౌకికవాదులను ఆహ్వానించడం ద్వారా ఇస్లాంకు చెందిన పుస్తకాలకు ప్రత్యామ్నాయం చూపాడని... అవినీతి, నైతిక విలువల దిగజారుడు ద్వారాలు తెరిచారంటూ మండిపడింది. ఇక మక్కా సమీపంలోని సౌదీ తీర నగరమైన జెడ్డాలో ఏప్రిలో డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబుల్ ఈవెంట్‌ నిర్వహించడాన్ని తప్పుబట్టింది అల్‌ఖైదా... సౌదీలో ప్రతీ రాత్రి సంగీత కచేరీలు జరుగుతున్నాయి. సినిమాలు, సర్కస్ ప్రదర్శనలు చేస్తున్నారని పేర్కొంది.