ఆల్‌ జజీరా ఆపరేషన్‌.. టెస్టులు ఫిక్స్‌

ఆల్‌ జజీరా ఆపరేషన్‌.. టెస్టులు ఫిక్స్‌

క్రికెట్ ప్రపంచంలో మ్యాచ్ ఫిక్సింగ్స్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ టీవీ ఛానెల్ సెర్వేలో మరో ఫిక్సింగ్‌ బట్టబయలైంది. ఈ సర్వేలో గత రెండేళ్లుగా టీమిండియా ఆడిన మూడు టెస్టులు మ్యాచ్ లు ఫిక్స్‌ అయినట్లు ఖతర్‌కు చెందిన అల్‌ జజీరా టీవీ చానెల్‌ తెలిపింది. దీంతో భారత్ తో పాటు క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఈ వ్యవహారం అంతా దావూద్‌ గ్యాంగ్‌ కనుసన్నల్లో జరిగినట్లు ఈ చానెల్‌ వెల్లడించింది. ఈ ఫిక్సింగ్ బూతంలో ముంబైకి చెందిన ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ రాబిన్‌ మోరిస్‌ ఉన్నాడు. అల్‌ జజీరా టీవీ చానెల్‌ జర్నలిస్ట్‌ డేవిడ్‌ హారిసన్‌ ఈ ఆపరేషన్‌ను ముంబై, యూఏఈ, శ్రీలంకలలో నిర్వహించారు. దీనికి  సంబంధించిన వీడియో డాక్యుమెంటరీ ఆదివారం ఓ వెబ్‌సైట్‌లో ప్రసారమైంది. అయితే మ్యాచ్ మొత్తం కాకుండా.. కొన్ని సెషన్లు, ఓవర్లు మాత్రమే ఫిక్సయ్యాయి. 2016 చెన్నైలో భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టు, 2017 రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు, గాలేలో శ్రీలంకతో ఆడిన టెస్టు మ్యాచ్‌లు ఫిక్సర్ల బారిన పడినట్లు అల్‌ జజీరా డాక్యుమెంటరీలో వెల్లడైంది.

అయితే ఈ ఫిక్సింగ్ లో ఇద్దరు ఆస్ట్రేలియా, ముగ్గురు ఇంగ్లండ్‌ క్రికెటర్ల పాత్ర ఉన్నట్లు ఆ డాక్యూమెంటరీలో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్ల పేర్లు మాత్రం వినపడకుండా ఆడియో కట్ చేశారు. ఆ వీడియోలో పాకిస్తాన్, శ్రీలంక ఆటగాళ్ల పేర్లు మాత్రం వినిపించాయి. హసన్‌ రజా(పాకిస్థాన్), దిల్హార లోకుహెత్తిగె, జీవంత  కులతుంగ, తరిందు మెండీస్‌(శ్రీలంక)ల పేర్లు వినిపించాయి. వీరితో పాటు గాలే(శ్రీలంక) పిచ్‌ క్యురేటర్‌.. శ్రీలంక-ఆసీస్, భారత్‌-శ్రీలంక టెస్టుల్లో పిచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. ఇంకా ఆ వీడియోలో "ప్రతీ స్క్రిప్టు నాదే. నేను ఏది చెపితే అదే జరుగుతుంది" అని డి-గ్యాంగ్‌కు చెందిన అనీల్‌ మునవర్‌ తెలిపాడు. ఇక భారత మాజీ దేశవాళీ  ఆటగాడు రాబిన్‌ మోరిస్‌ "నాతో 30 మంది ఆటగాళ్లున్నారు, నేనేది చెబితే వాళ్లంతా అదే చేస్తారు" అని అన్నాడు. అయితే ఈ ఫిక్సింగ్ భూతంపై దర్యాప్తు ప్రారంభించామని ఐసీసీ వెల్లడించింది.

Photo: FileShot