ఇంటర్నేషనల్ అవార్డు రేసులో అఖిల్ సినిమా

ఇంటర్నేషనల్ అవార్డు రేసులో అఖిల్ సినిమా
అక్కినేని కుటుంబానికి మనం వంటి బెస్ట్ అందించిన విక్రమ్ కుమార్ అఖిల్ తో హలొ చెప్పాడు.  హలో పాజిటివ్ టాక్ వచ్చింది.  సినిమా బాగుంది అన్నారు కానీ వసూళ్ల పరంగా మాత్రం సినిమా సోసో గా నడిచింది.  కమర్షియల్ గా హిట్ సాధించినప్పటికి చిత్ర బృందానికి మంచి పేరు తెచ్చిపెట్టింది.  ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తూ.. వరల్డ్ స్టంట్స్ ఇంటర్నేషనల్ అవార్డు రేసులో విదేశీ సినిమా కేటగిరిలో నిలిచింది.  
హాలీవుడ్ స్టంట్ మాస్టర్ బాబ్ బ్రౌన్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన ఈ సినిమా ఇంటర్నేషనల్ అవార్డు కేటగిరిలో నిలవడం విశేషం. యాక్షన్ దృశ్యాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయని చెప్పొచ్చు.  హలో తో పాటు  జర్మనీకి చెందిన ‘ప్లాన్-బి’, స్పెయిన్ చిత్రం ‘సోలో సె విప్ ఉన వెజ్’, రష్యన్ చిత్రం ‘రోడ్ టూ కావర్లి’, చైనాకు చెందిన ‘ఉల్ఫ్ వారియర్ 2’ వంటి చిత్రాలు పోటీ పడుతున్నాయి.