ఎన్టీఆర్ తో పోటీకి సిద్దమవుతున్న అఖిల్

 ఎన్టీఆర్ తో పోటీకి సిద్దమవుతున్న అఖిల్

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న క్రేజీ చిత్రం `అర‌విందస‌మేత‌` ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్‌లో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ద‌స‌రా సెల‌వుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే సేమ్ టైమ్ అక్కినేని అఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 3వ సినిమా రిలీజ‌వుతుంద‌ని చెబుతున్నారు. 

ప్ర‌స్తుతం అక్కినేని మిసైల్ అఖిల్ `తొలి ప్రేమ‌` ఫేం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని మెజారిటీ పార్ట్ బ్రిట‌న్‌లో త‌ర‌కెక్కించ‌నున్నారు. బ్రిట‌న్‌లో 2 నెల‌ల పాటు సుదీర్ఘ‌మైన‌ షెడ్యూల్‌లో 70శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తార‌ట‌. ఆగ‌ష్టు 14 నాటికే 70 శాతం టాకీ పూర్తి చేస్తారు. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 21న‌ రిలీజ్ చేయాల‌ని అనుకున్నా.. ద‌స‌రాకే (అక్టోబ‌ర్‌) రిలీజ్ ప్రీపోన్ చేయాల‌న్న ఆలోచ‌న యూనిట్‌కి ఉందిట‌. ఆ మేర‌కు ద‌ర్శ‌కుడిపై ఒత్తిడి ఉంటుంద‌ని తెలుస్తోంది. వెంకీ అట్లూరి 2వ సినిమా  ద‌ర్శ‌కుడిగా ఇదో ఛాలెంజ్‌గా తీసుకుంటున్నార‌ట‌.