దసరాకే వచ్చేస్తున్నాడు 

దసరాకే వచ్చేస్తున్నాడు 

అఖిల్ అక్కినేని ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల కిందటే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లిన ఈ చిత్రం అబ్రాడ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. తొలిప్రేమతో మంచి విజయం అందుకున్న వెంకీ దర్శకత్వంలో అఖిల్ చేస్తున్న చిత్రం కావడంతో ఆరంభం నుండే మంచి పాజిటివ్ హైప్ ఏర్పడింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను కేవలం మూడు నెలల్లో కంప్లీట్ చేయాలనీ స్ట్రెయిట్ షెడ్యూల్స్ వేసుకున్నారట. 

అంతా ప్లాన్ ప్రకారం సాగితే దసరా నాటికి రిలీజ్ చేయాలనీ చిత్రబృందం భావిస్తోందని తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉండనున్న ఈ చిత్రం అఖిల్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయేలా ఉందట. ఇందులో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. వెంకీ ఈ సినిమాకి తొలిప్రేమకి పనిచేసిన టెక్నీషియన్స్ ని మళ్ళీ రంగంలోకి దింపారు. తాజాగా ఈ ప్రాజెక్టులో ఎస్ థమన్ భాగమయ్యారు. ఈ BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి Mr మజ్ను అనే టైటిల్ పరిశీలనలో ఉంది.