రంగం సిద్ధం చేసిన అఖిల్ 

రంగం సిద్ధం చేసిన అఖిల్ 

అక్కినేని అఖిల్..హీరోగా చేసిన రెండు సినిమాలు తన కెరియర్ కు ఏమాత్రం సహాయం చేయలేక పోయాయి. గతేడాది విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తీసిన హలో సినిమా భారీ అంచనాలతో వచ్చిన నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు తాజాగా తన మూడో చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. కొద్దీ రోజుల క్రితమే ఈ కాంబినేషన్ సెట్ అవ్వగా..ప్రీ ప్రొడక్షన్ కు చాలా సమయం కేటాయించి అన్నింటిని పకడ్బంధీగా చూసుకున్నారు. 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల చివరి వారంలో మొదలుకానుంది. మొదటి షెడ్యూల్ ను అబ్రాడ్ వెళ్లి షూట్ చేయనున్నారు. ఇందులో అఖిల్ ఎంట్రీ సీన్స్ ను తెరకెక్కించారు. ఇందుకోసం అన్ని పనులను పూర్తయ్యాయని సమాచారం. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది. వెంకీ అట్లూరి..వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమా మంచి విజయం అందుకున్న నేపథ్యంలో ఈ అఖిల్ ప్రాజెక్టుపై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.