పూరి రొమాంటిక్ తెలుగు సినిమానా.. లేక..!!

పూరి రొమాంటిక్ తెలుగు సినిమానా.. లేక..!!

దాదాపు ఆరేడు సినిమాలు ఫెయిల్యూర్ తరువాత పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తీశారు.  అందులో కూడా బోల్డ్ సన్నివేశాలతో పాటుగా డైలాగులు కూడా బోల్డ్ గా ఉన్నాయి.  పక్కా మాస్ మూవీ కాబట్టి సూపర్ హిట్ అయ్యింది.  ఈ సినిమా హిట్ కావడంతో నెక్స్ట్ విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేశారు.  ఈ సినిమాను విజయ్ రేంజ్ కు తగ్గట్టుగా రొమాంటిక్ గా తీయాలని అనుకుంటున్నారు. అర్జున్ రెడ్డికి బాప్ లాగ సినిమా ఉండబోతుంది అనే సమాచారం అందుతోంది.  

ఇదిలా ఉంటె, పూరి కొడుకు ఆకాష్ పూరి తన కెరీర్లో హీరోగా రెండో సినిమా చేయబోతున్నాడు.  ఈ సినిమాకు పూరి, ఛార్మీలు నిర్మాతలు.  సినిమాను అనిల్ అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు.  పూరినే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.  కథకు తగ్గట్టుగా సినిమాకు రొమాంటిక్ అనే టైటిల్ ను నిర్ణయించారు.  రొమాంటిక్ అనే టైటిల్ కు తగ్గట్టుగానే సినిమా ఉండబోతున్నది అనే విషయం తెలిసిందే.  ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.  రొమాంటిక్ శృతిమించినట్టుగా ఉంది.  హీరోయిన్ కేతిక శర్మ వెనక వీపుభాగం మొత్తం ఎటువంటి బట్టలు లేకుండా ఉన్నది. హీరోయిన్ ను ఆకాష్ పూరి గట్టిగా హగ్ చేసుకొని ఉంటాడు.  తెలుగు సినిమాలు క్రమేణా బూతు సినిమాలుగా మారుతున్నాయోమో అనిపిస్తోంది.