ఇవాళ్టి నుంచే విశ్వాసం 

ఇవాళ్టి నుంచే విశ్వాసం 

తమిళ స్టార్ హీరో అజిత్ కు మన తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. గతేడాది వివేకం వంటి యాక్షన్ సినిమాతో పలకరించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే శివ దర్శకత్వంలో విశ్వాసం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చాల రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా..తమిళనాట ఏర్పడిన బంద్ దృష్ట్యా సెట్స్ మీదకు వెళ్ళలేదు. 

ఇంకా బంద్ కూడా ముగియడంతో ఇవాళ్టి నుండే రామోజీ ఫిలింసిటీలో రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టారు. అజిత్ ఇందులో పల్లెటూరి పెద్ద మనిషి పాత్రలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించనున్నాడు. గతంలో శివ, అజిత్ కాంబోలో వచ్చిన వీరం, వేదలమ్, వివేకం సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇలా వరుసగా నాలుగో సారి కూడా కలిసి ఈ సినిమా చేస్తుండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ దీపక్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా, డి ఇమాన్ సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తోంది.