అర్జంటుగా మహారాజకు అప్పు కావాలి

అర్జంటుగా మహారాజకు అప్పు కావాలి

ఎయిర్‌ ఇండియాను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో... కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది ఎయిర్‌ ఇండియా. దీంతో వెంటనే అప్పు కోసం బిడ్స్‌ను దాఖలు చేసింది. ప్రభుత్వ హామి ఉన్న రూ. 1000 కోట్ల స్వల్పకాలిక రుణం కోసం బిడ్‌లను ఆహ్వానించింది ఎయిర్‌ ఇండియా. ఫైనాన్షియల్‌ బిడ్స్‌ దాఖలు చేసేందుకు జూన్‌ 13 చివరి తేది. అత్యవసర అవసరాల కోసం నిధులు సమీకరిస్తున్నామని టెండర్‌ డాక్యుమెంట్‌లో ఎయిర్‌ ఇండియా పేర్కొంది. ఏడాది వ్యవధి ఉన్న ఈ బాండ్ల వ్యవధి తరవాత కూడా పెంచే అవకాశముంది. అయితే ప్రస్తుత బాండ్లకు మాత్రం ప్రభుత్వం ఒక ఏడాది మాత్రమే గ్యారంటీ ఇస్తుందని ఎయిర్‌ ఇండియా పేర్కొంది.