ఎయిర్‌ ఇండియా అమ్మకం.. అట్టర్‌ ఫ్లాప్‌ షో!

ఎయిర్‌ ఇండియా అమ్మకం.. అట్టర్‌ ఫ్లాప్‌ షో!

ఎయిర్‌ ఇండియాలో మెజారిటీ వాటా వొదిలించుకోవాలని చూసిన మోడీ సర్కారుకు మొండిచేయి ఎదురైంది. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 76 శాతం వాటాను విక్రయించేందుకు పౌర విమానయాన శాఖ బిడ్లను ఆహ్వానించింది. బిడ్‌లు దాఖలు ఇవాళే చివరి రోజు. కానీ  ఒక్క బిడ్‌ కూడా రాలేదు. వాస్తవానికి బిడ్స్‌ దాఖలుకు చివరి తేదీ మే 14 కాగా.. తరవాత మే 31 దాకా పొడిగించారు. అయినా ఎలాంటి స్పందనా రాలేదు. ఏ ఒక్కరు కూడా ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు.  మరోసారి బిడ్స్‌ దాఖలుకు చివరి తేదీని పొడించే ప్రసక్తే లేదని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఇది వరకే వెల్లడించారు.