సినీనటి వాణిశ్రీ ఇంటి విషాదం...

సినీనటి వాణిశ్రీ ఇంటి విషాదం...

సీనియర్ నటి వాణిశ్రీ ఇంట విషాదం నెలకొంది... వాణిశ్రీ కుమారుడు అభినయ్‌ వెంకటేష్‌ కార్తిక్‌ కన్నుమూశారు.. 36 ఏళ్ల అభినయ్‌ వెంకటేష్ కార్తిక్‌కు గుండెపోటు రావడంతో నిద్రలోనే మృతి చెందినట్లుగా చెబుతున్నారు.. చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్‌ కాలేజీలో అభినయ్‌ డాక్టర్‌గా పనిచేస్తుండగా.. ఆయన భార్య కూడా డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అభినయ్‌కు నాలుగు ఏళ్ల కుమారుడితో పాటు 8 నెలల కుమార్తె ఉంది.. చెంగల్పట్టు జిల్లా తిరుకలు కుండ్రం ఫార్మ్ హౌస్ లో అభినయ్ వెంకటేష్ మృతిచెందారు. కుమారుడు హఠాన్మరణంతో శోక‌సంద్రంలో మునిగిపోయింది వాణిశ్రీ కుటుంబ స‌భ్యులు. ఇక, అభినయ్ మృతికి సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు.. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.