నటి కుటుంబంలో కరోనా కలకలం

నటి కుటుంబంలో కరోనా కలకలం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దెబ్బకు దేశ దేశాలు గడగడలాడుతున్నాయి. చిన్న పెద్ద ,పేద ధనిక , సామాన్యులు సెలబ్రెటీలు అనే బేధం లేకుండా అందరిని భయబ్రాంతులకు గురిచేస్తుంది ఈ మహమ్మారి. ఇప్ప్పటికే పలువురు సెలబ్రెటీలు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజా ఓ నటి కుటుంబం మొత్తానికి కరోనా సోకిందని తెలుస్తుంది. ఘోర్ అండ్ బైరే, ఛాయా ఓ ఛాబీ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న బెంగాలీ నటి కోయల్ మల్లిక్ కరోనా బారిన పడ్డారు. ఆమె తండ్రి రంజిత్ మల్లిక్ ప్రముఖ బెంగాలీ నటుడు ఆయన కూడా కొవిడ్ బారిన పడ్డారు. తల్లి దీపా మల్లిక్, కోయల్ భర్త నిర్మాత నిస్సాల్ సింగ్ సహా కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం అందరం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నామని  ఆమె తెలిపారు.