శ్రీవారిని దర్శించుకున్న కీర్తిసురేశ్

శ్రీవారిని దర్శించుకున్న కీర్తిసురేశ్

ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు కీర్తి. టీటీడీ అధికారులు కీర్తికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వదించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం కీర్తిసురేశ్ ను పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా కీర్తి మీడియాతో మాట్లాడుతూ... 'మహానటి సినిమా ఘన విజయం సాధించడంతో  మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల వచ్చానని అన్నారు. 'మహానటి' సావిత్రి గారి జీవిత చరిత్రలో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు'. ఈ మహానటి చిత్రంకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.. స్వప్న దత్, ప్రియాంక దత్ లు నిర్మించారు.