వెబ్ సిరీస్ కు నో చెప్పిన అనుష్క... 

వెబ్ సిరీస్ కు నో చెప్పిన అనుష్క... 

కరోనా వైరస్ విజృంభణ వల్ల ఇప్పటికే టాలీవుడ్ సినీ పరిశ్రమకు చాలా నష్టం వచ్చింది. ప్రస్తుతం చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల ద్వారా విడుదల చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీల రాకతో వెబ్ సిరీస్ లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.ఈ నేపథ్యంలో దర్శకులు, స్టార్ సెలబ్రెటీలు వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేస్తున్నారు. కానీ తెలుగు స్టార్ హీరోయిన్ అనుష్క మాత్రం తనకు వచ్చిన వెబ్ సిరీస్ అవకాశానికి నో చెప్పిందట! ప్రస్తుతం ఎంటర్టైన్‌మెంట్ రంగంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లు మంచి ఫామ్‌లో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీ ద్వారా విడుదలై సక్సెస్ అయ్యాయి. ఇక తాజాగా అనుష్క నటించిన నిశ్శబ్దం' సినిమా కూడా ఓటీటీలోనే విడుదల కానుంది. అందువల్ల అనుష్కతో భారీ వెబ్ సిరీస్ చేసేలా ప్లాన్ చేసిందట ఓ నిర్మాణ సంస్థ. అందుకోసం నిర్మాతలు స్వీటీని సంప్రదించి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట.  అయిన కూడా అనుష్క ఆ వెబ్ సిరీస్ లో నటించడానికి నో చెప్పిందట.