వైకాపా తరపున విశాల్ ప్రచారం..?

వైకాపా తరపున విశాల్ ప్రచారం..?

తెలుగులో పాపులరైన తమిళ హీరోల్లో విశాల్ ఒకరు.  విశాల్ సినిమాలు అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ విడుదలయ్యి మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.  పందెంకోడి తో మొదలైన హవా నిన్నటి అభిమన్యుడు వరకు కొనసాగింది.  ఇలాంటి సినిమాలే తీస్తే విశాల్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ లభిస్తుంది అనడంలో సందేహం లేదు.  కాగా, ఇప్పుడు విశాల్ గురించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.  

విశాల్ వైకాపా తరపున వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందొ అని విశాల్ ను అడిగితె.. జగన్ తనకు ఎప్పటి నుంచో తెలుసునని.. జగన్ తన ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పాడు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్నట్టు తెలిపారు.  ప్రచారం చేయమని అడిగితె అప్పుడు ఆలోచిస్తా" అన్నారు.  వైకాపా తరపున ప్రచారం విషయాన్నీ విశాల్ కొట్టి పారెయ్యడం లేదు.  

మరోవైపు వైకాపా తరపున ప్రచారం చేయబోడని కూడా ప్రచారం జరుగుతోంది.  అందుతున్న సమాచారం ప్రకారం, మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు విశాల్ సిద్ధంగా ఉన్నారు.  అవకాశం కోసమే విశాల్ ఎదురు చూస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో వైకాపా బీజేపీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని వార్తలు వస్తుండటంతో.. వైకాపా తరపున ప్రచారం చేసే విషయాన్ని విశాల్ పక్కన పెట్టాడని సమాచారం. ఒకవేళ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకుంటే విశాల్ వైకాపా తరపున ప్రచారం చేస్తాడా..? చూద్దాం.