నటుడు అశుతోష్ భార్యకి  కరెంట్ బిల్ షాక్

నటుడు అశుతోష్ భార్యకి  కరెంట్ బిల్ షాక్

లాక్ డౌన్ తరవాత దేశ వ్యాప్తంగా కరెంట్ బిల్లు చూస్తేనే ఒక్కొక్కరికి షాక్ తగులుతుంది. సాధారణ ప్రజలకే కాకుండా ఇప్పుడు సెలబ్రెటీలు సైతం తమ కరెంట్ బిల్లులు చూసి షాక్ అవుతున్నారు. ఇటీవల సినిమా హీరోయిన్స్  కార్తీక , తాప్సీ లకు భారీ గా కరెంట్ బిల్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా  బాలీవుడ్‌ నటుడు అశుతోష్ రాణాకు కూడా ఈ బిల్లు భారం తప్పలేదు . నెల రోజూలోనే భారీగా బిల్లు రావడం చూసి ఆయన భార్య రేణుకా సహానే మండిపడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "మే 9వ తేదీన నాకు రూ. 5510 బిల్ వచ్చింది. అయితే జూన్‌లో మరో బిల్ రూ. 29700 వచ్చింది. అంటే మే మరియు జూన్‌లో వచ్చిన బిల్స్‌ని పరిశీలిస్తే.. ఒక్క మే నెలకే నాకు రూ. 18080 బిల్ వేశారు. అంతకుముందు నెల రూ. 5510 వచ్చిన బిల్, ఒక్క నెలకే రూ. 18080 ఎలా అయ్యింది?"  అంటూ ముంబై అదానీ ఎలక్ట్రిసిటీని ట్యాగ్ చేస్తూ మండిపడ్డారు రేణుకా.