మేడ్చల్ సబ్ రిజిస్టార్ ఇంటిపై ఏసీబీ దాడులు

మేడ్చల్ సబ్ రిజిస్టార్ ఇంటిపై ఏసీబీ దాడులు

ఈ మధ్య కాలంలో ఏసీబీ ఆకస్మిక దాడులను నిర్వహిస్తూ అవినీతి పరులను పట్టుకుంటుంది. ఈ క్రమంలో ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో.. మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ ఎన్.కిషన్‌ ప్రసాద్ ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. అల్మాస్‌గూడలోని కిషన్‌ ప్రసాద్‌కు చెందిన రెండు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు కిషన్ ప్రసాద్ బంధువులకు సంబందించిన నాలుగు ఇళ్లపై ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్‌పి బీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో.. నలుగురు ఇన్స్ స్పెక్టర్ల సమక్షంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయని డీఎస్‌పి సత్యనారాయణ తెలిపారు. ఈ దాడులలో ఇప్పటి వరకు రెండు ఇళ్ళతో పాటు, నాలుగె ఎకరాల  భూమిని ఏసీబీ అధికారులు గుర్తించారు.