డివిలియర్స్ షాట్ కు ముగ్దుడైన కోహ్లి

డివిలియర్స్ షాట్ కు ముగ్దుడైన కోహ్లి

ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో మేటి గొప్ప బ్యాట్స్ మెన్ ఎవరంటే నిస్సందేహంగా వెంటనే గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. గ్రౌండ్ నలువైపులా ఎలాంటి షాట్ అయినా అలవోకగా ఆడగల సమర్ధుడు కోహ్లీ. అలాంటి కోహ్లీనే మంత్రముగ్దున్ని చేసాడు మరో మేటి బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్. శనివారం ఢిల్లీ, బెంగుళూరు జట్ల మధ్య జరుగుతున్న  మ్యాచ్ లో.. డివిలియర్స్ స్కేర్‌లెగ్ దిశగా కొట్టిన సిక్స్ కోహ్లిని షాక్‌కు గురి చేసింది. డివిలియర్స్ కొట్టిన సిక్స్ కి డౌగ్ అవుట్ లో ఉన్న కోహ్లీ ముగ్దుడై చప్పట్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు ఏబీ. కేవలం 37 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు చేసి బెంగుళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ కోహ్లితో కలిసి విలువైన ఇన్నింగ్స్ ను ఆడాడు. కోహ్లీని సైతం ఆశ్చర్యపరిచిన ఆ షాట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

Poto: FileShot