నా కంటే ఎక్కువగా విరాట్ ను నమ్మవచ్చు... 

నా కంటే ఎక్కువగా విరాట్ ను నమ్మవచ్చు... 

విరాట్ కోహ్లీకి మంచి సమయంలో లాక్ డౌన్ వచ్చిందని ,  కోహ్లీ నిజంగా ఈ సమయంలో చాల రిఫ్రెష్ అవుతాడు అని తాను భావిస్తున్నట్లు, అలాగే రాబోయే 3 నుండి 5 సంవత్సరాలలో భారత కెప్టెన్ నుండి ఇంకా మంచి ప్రదర్శన ఆశిస్తున్నట్లు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఎబి డివిలియర్స్ అన్నాడు. అయితే కోహ్లీ, డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు కోసం అనేక భారీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఆర్సిబి కెప్టెన్ కోహ్లీ మరియు డివిలియర్స్ ఐపీఎల్ లో  2 రికార్డ్ బ్రేకింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పారు, ఈ  విషయం పై డివిలియర్స్ స్పందిస్తూ... మా కుడి, ఎడమ బ్యాటింగ్ కారణంగా ఇది సాధ్యం అవుతుందని చెప్పారు. అయితే నా కంటే కోహ్లీ ఎక్కువగా నమ్మదగిన బ్యాట్స్మాన్. నేను వ్యక్తిగతంగా కొంచెం ముందుగానే దాడి చేయాలనుకుంటాను, బాట్స్మెన్ ప్రారంభంలో బలహీనతను చూపించకూడదు. అందువల్ల నేను ముందే దాడి చేస్తే బౌలర్లు ఇబ్బంది పడుతారని అనుకుంటున్నాను అందుకే నేను కొన్నిసార్లు త్వరగా ఔట్ అవుతాను, కానీ కోహ్లీ అలా కాదు అతను బౌలర్ స్టైల్ కు తగ్గట్టుగా తన ఆటను మార్చేస్తాడు అని డివిలియర్స్ అన్నాడు.