భారత ఆసీస్ పర్యటనకు అవకాశాలు చాల ఉన్నాయి : ఫించ్

భారత ఆసీస్ పర్యటనకు అవకాశాలు చాల ఉన్నాయి : ఫించ్

కరోనా సంక్షోభం తరువాత క్రికెట్ మళ్లీ అభివృద్ధి చెందడానికి, క్రికెట్ బోర్డులు మరియు క్రీడలో వాటాదారులు చాల ప్రయత్నాలు చేస్తారని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే అనేక సిరీస్‌లు వాయిదా వేయడంతో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రీడలను పునః ప్రారంభించినప్పుడు మళ్ళీ సిరీస్లు షెడ్యూల్ చేయడం పెద్ద పని అని అన్నారు. అలాగే ఆస్ట్రేలియాలో అక్టోబర్-నవంబరులో షెడ్యూల్ ప్రకారం టీ 20 ప్రపంచ కప్ ముందుకు సాగడంపై సందేహాలు ఉన్నాయి అని తెలిపాడు.

ఆటలు పునః ప్రారంభమైన తర్వాత క్రికెట్ బోర్డులు కలిసి పనిచేయడం చాలా ముఖ్యం అని చెప్పిన ఆరోన్ ఫించ్, ఈ ఏడాది టీ 20, టెస్ట్ సిరీస్‌లకు షెడ్యూల్ ప్రకారం భారత్ ఆసీస్ లో పర్యటించే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయని ఆరోన్ ఫించ్ అన్నారు. ఈ వేసవిలో భారత జట్టు ఇక్కడకు రావడం కొరకు 10 లో 9 శాతం అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.