మా అమ్మకు కరోనా నెగిటివ్ రావాలని ప్రార్థించండి : అమీర్ ఖాన్

మా అమ్మకు కరోనా నెగిటివ్ రావాలని ప్రార్థించండి : అమీర్ ఖాన్

కరోనా మహమ్మారి దెబ్బకు సామాన్యులు , సెలబ్రెటీలు అని తేడా లేకుండా అందరూ బలైపోతున్నారు .. తాజాగా సినిమా ఇండస్ట్రీలోనూ కొందరు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.  తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్టాఫ్ కు కరోనా పాసిటివ్ అని తేలింది. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా అమీర్  ఒక సుదీర్ఘ లేఖను పోస్ట్ చేశారు.. " నా స్టాఫ్ లో కొందరు కరోనా బారిన పడ్డారని తెలియజేస్తున్నాను. కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే అందరినీ క్వారంటైన్ చేశారు. సకాలంలో, అత్యంత వేగంగా స్పందించి నా స్టాఫ్ కు వైద్య సదుపాయాలను కల్పించిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కి ధన్యవాదాలు. నా సిబ్బంది పట్ల చాలా కేర్ తీసుకున్నారు. నా సిబ్బందిలోని మిగిలిన వారికి మాత్రం నెగెటివ్ అని తేలింది. టెస్ట్ చేయించుకోమని మా అమ్మకు చెపుతున్నా...ఆమెకు నెగెటివ్ రావాలని భగవంతుడిని ప్రార్థించండి. అని అమీర్ ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు . ఇక కోకిలాబెన్ ఆసుపత్రికి , డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి అమీర్  కృతజ్ఞతలు తెలిపారు . అందరూ సురక్షితంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ' అంటూ అమీర్ ట్వీట్ చేశారు.