భారత్ లో పాకిస్థాన్ జట్టు...?

భారత్ లో పాకిస్థాన్ జట్టు...?

వచ్చే ఏడాది జరిగే టీ 20 ప్రపంచ కప్‌ కోసం భారత్‌కు రావడం పట్ల పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎలాంటి భయం అవసరంలేదని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు. 2021 టీ 20 ప్రపంచ కప్ అలాగే  2023 వన్డే వరల్డ్ కప్ ‌లో ఆడటం కోసం భారత్ కు రావడానికి తమ ఆటగాళ్లకు వీసాలు పొందడంలో ఎలాంటి సమస్యలు ఎదురుకావని బీసీసీఐ నుండి లిఖితపూర్వక హామీలు ఇప్పించాలని ఐసీసీ ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరింది. అయితే గతంలో  పాకిస్తాన్ అథ్లెట్లకు భారతదేశంలో వచ్చి ఆడటానికి భారత్ వీసాలు నిరాకరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి, అందువల్ల పీసీబీ ఈ విధంగా కోరింది. ఈ విషయం పై అశోక్ చోప్రా మాట్లాడుతూ... భారతదేశంలో జరిగే టీ 20 ప్రపంచ కప్ ఆడటానికి పాక్ జట్టుకు క్లియరెన్స్ వస్తే వారికి భద్రత హామీ ఇవ్వబడుతుంది అని అన్నాడు. ఈ విషయం పై బీసీసీఐ ఇప్పుడే ఏమీ చెప్పనవసరం లేదు. ఎందుకంటే... కరోనా వైరస్ కారణంగా సమీప భవిష్యత్తులో ఏమి జరగబోతోందో ఎవరికి తెలియదు. ముందు ఈ విషాయం పై క్లారిటీ  వస్తే అప్పుడు ఈ భద్రత సమస్యలన్నింటినీ పరిష్కరించవచ్చు అని  తెలిపాడు.