ఆ ఏడాది దాదా కెప్టెన్సీకి దూరం కావడానికి కారణం అతడే... 

ఆ ఏడాది దాదా కెప్టెన్సీకి దూరం కావడానికి కారణం అతడే... 

ప్రస్తుత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ గురించి అందరికి తెలుసు. అయితే బీసీసీఐ 2008లో ఐపీఎల్ ప్రారంభించినప్పుడు దాదా  కోల్‌కత నైట్ రైడర్స్(కేకేఆర్)  కు న్యాయకత్వం వహించేవాడు. అయితే అప్పుడు ఆ జట్టుకు కోచ్ గా జాన్ బుచానన్ ఉండేవాడు. ఇక ఆ తర్వాత ఏడాది ఐపీఎల్ లో కేకేఆర్ కెప్టెన్సీకి దూరం అయ్యాడు దాదా. వారి కోచ్ కారణంగానే అలా జరిగింది అంటున్నాడు మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా. గంగూలీ మరియు జాన్ మధ్య ఉన్న సంబంధం గురించి ఆకాష్ మాట్లాడుతూ... ప్రారంభంలో గంగూలీ మరియుజాన్ కు విభేదాలు లేవు  కానీ కాలంతో పాటు పరిస్థితులు మారిపోయాయి దాంతో ఆ కోచ్ కోల్‌కతా కెప్టెన్‌గా మాజీ భారత కెప్టెన్‌ను తొలగించాలని కోరుకున్నాడు. అది అతను చేసాడు కూడా  తరువాతి సీజన్లో కేకేఆర్ కాప్టెన్ గా బ్రెండన్ మెక్కల్లమ్ ఎంపికయ్యాడు, ఆయితే మొదటి సీజన్‌లో ఆరో స్థానంలో నిలిచినా ఆ జట్టు తరువత ఎనిమిదో స్థానంలోకి పడిపోయింది, దాంతో మళ్ళీ 2010లో కేకేఆర్ కెప్టెన్ గా దాదా వచ్చాడు దానికి ప్రతిచర్యగా బుచానన్ ను ఫ్రాంచైజ్ కోచ్‌గా తొలగించారు అని ”చోప్రా అన్నారు.